నవతెలంగాణ – కంఠేశ్వర్ : అమ్మ నగర్ గృహ వాసులు చాలా సార్లు మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ ఆఫీసు లో కలిసి అమ్మ నగర్ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం అమ్మ నగర్ కు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విచ్చేసి అమ్మ నగర్ లో దాదాపు ఒక గంట సేపు కలియ తిరిగారు. కాలనీ వాసుల సమస్యలు తెలుసుకుంటూ, రోడ్డు గుంతలను, రోడ్డుకు ఇరువైపులా డివైడర్ ల మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను, వెంకటేశ్వర ఆలయం దగ్గర నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన మట్టి రోడ్డు బురదతో ఉండడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిడ్జి కి బిటి లింక్ రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
రోడ్డు కు ఇరువైపుల డివైడర్ ల మధ్య లో గల పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగింప చేసి వన మహోత్సవం లో భాగంగా మంచి చెట్లు పెట్టిస్తామన్నారు. వీది లైట్ల ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో గల కుక్కల బెడదను నివారిస్తమని, మూడున్నర ఎకరాలు గల పార్కు ను అభివృద్ధి చేస్తామని కాలనీ వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ నగర్ సొసైటీ అధ్యక్షులు రెంజర్ల నరేష్, అమ్మ నగర్ గృహ వాసుల సంఘం అధ్యక్షులు యెండల కిషన్, ప్రధాన కార్యదర్షి బొబ్బిలి కిషన్, ఉపాధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి మహేందర్, కాలనీ వాసులు న్యాలం రవి, దగ్గుల మధుసూదన్, పంచరెడ్డి ఎర్రన్న, ప్రవీణ్, ఈశ్వర్, రవి,రాజు, అనిల్, నారాయణ, వారాహి దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్, మాజీ కార్పోరేటర్ పంచరెడ్డి సూరి తదితరులు పాల్గొన్నారు.