Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రివ్యూ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్

రివ్యూ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
ఈరోజు పురపాలక కార్యాలయం లో సిబ్బంది అందరికి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది కి తగు సూచనలు చేయటం జరిగింది.  పట్టణ పరిధిలో పూర్తిగా 100% ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్నులు వసూలు చేయాలనీ, షాపుల అద్దె పూర్తిగా వసూలు చేయాలనీ రెవిన్యూ విభాగం వారికి ఆదేశించారు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఆన్లైన్ లో జియోటాగ్ చేయాలనీ వార్డు ఆఫీసర్స్ కు ఆదేశించడం జరిగింది. పట్టణంలో మాంసం విక్రయదారులు పశువధ శాలలో మాత్రమే క్లీనింగ్ చేసుకోవాలని తెలియజేశారు. పట్టణ పరిధిలో నీటి కుళాయి కనెక్షన్స్ ఆన్లైన్ లో పొందుపరిచాలని, అనుమతి లేని నీటి కుళాయి కనెక్షన్స్ గుర్తించి వాటికి పెనాల్టీ విధించాలని AEE కి ఆదేశించడం జరిగింది.

జనన మరణ ధ్రువీకారణ పత్రాలకు వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ లో పొందుపరిచలని సెక్షన్ వారికి ఆదేశించడం జరిగింది. ఆసరా పెన్షన్స్ వెరిఫికేషన్ చేయాలనీ, spouse పెన్షన్స్ వెంటనే ఆన్లైన్ లో పొందుపరిచలని, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా మరణిస్తే, వెంటనే తొలగించాలని ఆదేశించారు. వీధి విక్రయ దారుల సర్వే పూర్తిచేసి, వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలనీ, బ్యాంకు లింకేజీ లు పెంచాలని MEPMA వారికి ఆదేశించారు.

పట్టణ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా కలెక్ట్ చేయాలనీ, పట్టణం లో ఎక్కడ కూడా చెత్త కనపడకుండా స్వీపింగ్ చేయాలనీ, మురికి కాలువలను శుభ్రపరచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ కు ఆదేశించారు. ఇట్టి సమావేశం నందు AEE షేబ్బీర్ అహ్మద్, మేనేజర్ VLP రాజకుమారి నోరి, సానిటరీ ఇన్స్పెక్టర్ రంగన్న, అకౌంటెంట్ రమేష్, EE శివ, వార్డు ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -