కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను పర్యవేక్షణ చేసిన పోలీస్ కమీషనర్
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11, 2026న ముగిసిన తర్వాత, బ్యాలెట్ బాక్సులను తరలించిన అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గట్టి భద్రత ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలిటెక్నిక్ కళాశాల యందు ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాటు పటిష్టంగా చేయాలని ఆదేశాలు జారిచేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద 24/7 నిరంతర నిఘా కోసం అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు (ఫిబ్రవరి 14 వరకు) నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ , భీంగల్ ప్రాంతాల్లో సెక్షన్ 163 బిి ఎన్ ఎస్ ఎస్ (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడ కూడదని స్పష్టం చేశారు.ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై నాన్-బైలబుల్ కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి , నిజామాబాద్ ఏసిపి బి.ప్రకాష్ టౌన్ సిఐ శ్రీనివాస రాజ్ , 3 టౌన్ ఎస్ఐ హరిబాబు ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాదు లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



