Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్యామ్ కు సన్మానం 

మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్యామ్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జాతీయ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన, బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా శ్యామ్ ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఘనంగా సన్మానించారు. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇంఛార్జి, బీసీ ముద్దు బిడ్డ, నిజామాబాద్ పూలేగా పిలవబడే పోతంకర్ లక్ష్మీనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని, లక్ష్మీనారాయణ ని సైతం ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

వారితోపాటు ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ గా ఎన్నికైన, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య ని సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడుగా హెచ్. రేవంత్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రేవంత్ ను బీసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ రేవంత్ , జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏనుగందుల మురళి, ఉపాధ్యక్షులు శివాజీ లక్ష్మణ్ రావు, మెతుకు శివ కుమార్, కార్యదర్శి సుభాష్ పద్మ, అధికార ప్రతినిధి ఆమంద్ ప్రవీణ్ కుమార్, నగర కార్యదర్శి హైమద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్, జిల్లా నాయకులు కరిపే రాజు, న్యాలం రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -