Tuesday, February 17, 2026
E-PAPER
Homeఖమ్మంఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ దంపతులు

ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ దంపతులు

- Advertisement -

– ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి
– మున్సిపల్ దంపతులతో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజల అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగా మున్సిపాలిటీ లో అభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ లకు సూచించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతన తొలి చైర్ పర్సన్‌, చైర్మన్ గా ఎన్నికైన జూపల్లి శశికళ – జూపల్లి రమేష్ బాబు లు మంగళవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ను గండుగులపల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యే చేసిన విశేష కృషి,ప్రజలను కలుసుకుని అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించిన తీరు పట్ల వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో నిరంతరం శ్రమించి పార్టీకి ఘన విజయం అందించిన నేపథ్యంలో అభినందనలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చైర్పర్సన్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టణంలో మౌళిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ప్రజల అభిరుచులకు ,ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ ప్రతి వార్డులో నిష్పక్షపాతంగా అభివృద్ధి జరగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి రవి,తమనంపుడి విజయ్ కుమార్ రెడ్డి,దూబకుంట్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -