Friday, March 20, 2026
E-PAPER
Homeఖమ్మంఅన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ దంపతులు

అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ దంపతులు

- Advertisement -

– పట్టణ అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట పుర ప్రజల సుఖశాంతులు, ఆర్థిక అభివృద్ధి కోసం పురపాలక సంఘం చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు లు శుక్రవారం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి కటాక్షంతో పట్టణం, మండలం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అలాగే ప్రజల ఆశీస్సులతో మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడేపల్లి రవి, క్రాంతి దుర్గారావు, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -