– మొదటి 12 వార్డుల్లో వెలువడిన ఫలితం
– కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ ఐదు కైవసం
– బిజెపి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం
– 13-24వ వార్డులకు కౌంటింగ్ ప్రారంభం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హోరాహోరి పోరు కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను మొదటి విడత 12 వార్డుల ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి రౌండులో బీఆర్ఎస్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థుల్లో 4వ వార్డు కొండ్రు ప్రవీణ్ కుమార్ విజయం సాధించారు. 5 వార్డు జెర్కొని మమత, 7 వ వార్డు సుదర్శన్ రెడ్డి, 11 వ వార్డు కొండ్రు శ్రీలత, 12 వ వార్డు కొండిగారి త్రిలోక్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ గెలిచిన ఐదు స్థానాల్లో.. 2వ వార్డు నీళ్ల బాను బాబు, 6 వ వార్డు మొహమ్మద్ అమీన బేగం, 8వ వార్డు వర్థ్య రాందాసు, 9వ వార్డు దారు రాఘవేందర్ రావు,
10వ వార్డు దొంతరమోని భార్గవి విజయం సాధించారు. ఇక బీజేపీ ఒకటవ వార్డులో ముత్యాల శ్యామల, 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మురళీకృష్ణ విజయం విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక 13వ వార్డు నుంచి 24 వ వార్డు వరకు రెండో విడత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడో వార్డులో ఉత్కంఠ రేపినప్పటికీ చివరికి రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కమలాకర్ రెడ్డి పై సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు.



