- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు కాగా.. 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం.
- Advertisement -


