నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన ప్రభుత్వం మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల గడువు 2025 జనవరి 26తో ముగిసింది. పాత పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన విధించారు ఇప్పటికే ఏడాది అవుతుండటంతో సాధ్యమైనంత త్వరగా కొత్త పాలక మండళ్లను ఎన్నుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల వారీగా విభజన ప్రక్రియపై ఇప్పటికే దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కోర్టులో ఉన్నందున అధికారికంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు.
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



