-మహిళలకు చైర్మన్ పీఠం
ఆశావాహుల మగరాయుళ్లకు నిరాశ
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ కోటా లను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనగణన తో పాటు సమగ్ర కుల గణన ను ప్రామాణికంగా తీసుకొని ఈ రిజర్వేషన్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
వార్డులతో పాటు చైర్మన్ పీఠానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా నిర్ణయించ గా, దీనిపై అధికారిక ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉందని సమాచారం. అశ్వారావుపేట మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించే అవకాశాలు బలంగా ఉన్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ పరిణామంతో చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు మగ ఆశావాహులకు నిరాశ తప్పలేదు. మహిళా రిజర్వేషన్ ఖాయం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది.
అశ్వారావుపేట మున్సిపాలిటీ – వార్డు వారీగా రిజర్వేషన్ వివరాలు:
వార్డు నెంబర్ రిజర్వేషన్
1 బీసీ (జనరల్)
2. ఎస్సీ (మహిళ)
3 బీసీ (జనరల్)
4 బీసీ (మహిళ)
5 బీసీ (మహిళ)
6. జనరల్ (మహిళ)
7 ఎస్సీ (జనరల్)
8 జనరల్ (మహిళ)
9 ఎస్టీ (జనరల్)
10 అన్రిజర్వడ్
11 అన్రిజర్వడ్
12. ఎస్టీ (మహిళ)
13 అన్రిజర్వడ్
14 ఎస్టీ (జనరల్)
15 జనరల్ (మహిళ)
16 జనరల్ (మహిళ)
17 జనరల్ (మహిళ)
18 అన్రిజర్వడ్
19 అన్రిజర్వడ్
20 జనరల్ (మహిళ)
21 ఎస్సీ (మహిళ)
22 ఎస్సీ (జనరల్)
సూటిగా చెప్పాలంటే.. ఇవి కేవలం రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లే కావచ్చు,కానీ స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పరిణామం అనుకోవచ్చు. మహిళా రిజర్వేషన్ సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల సాంప్రదాయ రాజకీయ వర్గాలు వెనక్కి నెట్టబడుతున్నాయి. ఇకపై ఆశావాహులు భావోద్వేగాలతో కాకుండా చట్టపరమైన వాస్తవాలతో రాజకీయ వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.



