– మూడు నామినేషన్ ల స్వీకరణ కేంద్రాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుండటంతో ఎన్నికలు సంఘం చకచకా ఏర్పాట్లు చేపడుతుంది. రిజర్వేషన్ లు ఖరారు కావడంతో నోటిఫికేషన్ విడుదల కావడమే తరువాయి. ఈ క్రమంలో అశ్వారావుపేట మున్సిపాల్టీ లోని 22 వార్డులకు గాను నామినేషన్ లు స్వీకరించడానికి మూడు కేంద్రాలు ఏర్పాటు చేసారు.
స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో ఒకటి నుండి 7 వార్డులకు,మండల పరిషత్ కార్యాలయంలో 8,9,13,14,15,16,18 మొత్తం 7 వార్డులకు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మోనట్రింగ్ కార్యాలయంలో 10,11,12,17,19,20,21,22 మొత్తం 8 వార్డులకు నామినేషన్ లు స్వీకరిస్తారు.
స్థానిక వ్యవసాయ కళాశాలలో ఈవీఎం లేక్ బ్యాలెట్ బాక్స్ లు భద్రపరిచే (స్ట్రాంగ్ రూం),పోలింగ్ సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్ ),పోలింగ్ అనంతరం పోలింగ్ సామాగ్రి భద్రపరిచే రిసెప్షన్,ఓట్లు లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.



