Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికులకు గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి

మున్సిపల్ కార్మికులకు గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి

- Advertisement -

ఐఎన్టీయుసి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పాశం రవి యాదవ్ 
నవతెలంగాణ – పరకాల 
: పరకాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు పెంచాలని ఐఎన్టీయూసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పాశం రవి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికులు రవి యాదవ్ నాయకత్వంలో మున్సిపల్ కమిషనర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరకాల మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ జవాన్ లకు, డ్రైవర్ల లకు జీతాలు రూ.25 వేల 5 వందలు చెల్లించాలన్నారు. జీవో నెం.14 జివో నెం.60, 63 ప్రకారం జీతాలు పెంచాలన్నారు. ఖమ్మం, కరీంనగర్, హుజురాబాద్ , జమ్మికుంట, భూపాలపల్లిలో జవాన్ డ్రైవర్ లకు ఇచ్చు జీతము రూ.25500 ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ డి. రమేష్, వర్కింగ్ ప్రెసెడెంట్ పసుల సారయ్య, మంద మహేశ్ ,ఉపాధ్యక్షురాలు గుర్రపు సరోజన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -