– ప్రధాన కూడలి లో సీసీ రోడ్ కు శంకుస్థాపన చేసిన మున్సిపల్ దంపతులు
– దుమ్ము ధూళి కి శాస్వత పరిష్కారం
– రూ.90 లక్షల వ్యయం తో చేసే పనులు ప్రారంభం
– ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ లు జూపల్లి శశికళ రమేష్ బాబు దంపతులు గురువారం మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు లో ఎంతో కాలంగా దుమ్ము ధూళి, అడపాదడపా ప్రధాన కూడలి లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు నివారణకు శాశ్వత పరిష్కారం చేపట్టారు.ఇందుకోసం రూ.90 లక్షల వ్యయం తో మూడు రోడ్ల ప్రధాన కూడలి లో నిర్మించ నున్న సీసీ రోడ్ నిర్మాణం కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో శంకుస్థాపన చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన కూడలిలో తరచుగా చోటు చేసుకుంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత వాహనదారులు,వ్యాపారులు స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని పేర్కొన్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను నాన్యతగా చేపడుతున్నామని, నియోజకవర్గం కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ ( బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, ఆర్ అండ్ బీ డీఈ ఎం.ప్రకాశ్, కమీషనర్ నాగరాజు, కౌన్సిలర్ లు, కాంట్రాక్టర్ యేలూరి అప్పారావు,కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, పాక్స్ మాజీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



