Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంఅభిమాని కోరికను తీర్చిన మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి 

అభిమాని కోరికను తీర్చిన మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి 

- Advertisement -

పాదయాత్ర గా ముత్యాలమ్మ తల్లి దర్శనం
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఒక అభిమాని కోరిక మేరకు అశ్వారావుపేట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు ఆదివారం చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన భక్తి భావంతో అమ్మవారిని దర్శించుకునేందుకు నడకదారి ఎంచుకున్నారు.

ఈ పాదయాత్రలో ఆయనతో పాటు స్థానిక నాయకులు తాడేపల్లి రవి,దూబగుంట్ల దుర్గా రావు,తమనంపుడి విజయ్ కుమార్,కానూరి మోహన్ రావు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో స్థానికులు ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రజల కోరికలను గౌరవించడం తన బాధ్యత అని, భక్తి విశ్వాసాలు మన సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా రమేష్ బాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -