Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..తొలి ఫలితాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్..తొలి ఫలితాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాలు వెలువడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బోణీ కొట్టాయి.

ములుగు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలుపొందారు. మరోవైపు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించి ఆ పార్టీ ఖాతా తెరిచారు. యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం కాగా, వాటిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొన్నింటిని కైవసం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -