తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలో గోల్డ్ , సిల్వర్ పథకాలు సాధించిన అక్క చెల్లెలు..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మహాత్మ జ్యోతిబా పూలే బిసి బాలికల పాఠశాలలో చదివే విద్యార్థులు ఇటీవల రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న 69వ ఎస్ జి ఎఫ్ ఇంటర్ స్టేట్ తైక్వాండో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలలో పాల్గొనేందుకు నలుగురు విద్యార్థులు ఎంపికైనారు. ఆ పోటీలో పాల్గొన్న గిరిజ, చందన సొంత అక్క చెల్లెల్లు. ఈ పోటీల్లో గిరిజ గోల్డ్ మెడల్, చందన సిల్వర్ మెడల్ సాధించడంతో ఆ పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి మెడల్ సాధించిన విద్యార్థి గిరిజ, చందనను కోచ్ అంబటి ప్రణీత్ లను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తైక్వాండో లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి నవంబర్ 15 నుండి 19 వరకు జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలోకి తమ పాఠశాల విద్యార్ధి గిరిజ జాతీయ స్థాయి పోటీలోకి అర్హత సాధించడం హర్షించ దగ్గ విషయం అని అన్నారు. విద్యార్ధులు కేవలం చదువే కాదు ఆటల్లో వివిధ కళా నైపుణ్యాలలో తమ ప్రతిభ కనబరిచి ముందుకు వెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో ఎల్లప్పుడూ విద్యార్ధులకు సేవలు అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యార్ధులను అర్హత సాధించే విధంగా కృషి చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి వల్లమల్ల విజయ, పి ఈ టి నాగమణి,పాఠశాల అధ్యాపకులు తదితరులు ఉన్నారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీకి ఎంపికైన మునుగోడు విద్యార్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



