నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నుండి కచలాపురం, పలివెల, సర్వేల్, గుడిమల్కాపురం వరకు డబల్ రోడ్డు నిర్మాణం నిధులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ కార్యదర్శి కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు గ్రామపంచాయతీ మేజర్ అయినప్పటికీ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందుల గురవుతున్నారని అన్నారు. గ్రామంలోని అన్ని వార్డులలో మురికి కాల్వలు, సిసి రోడ్లు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా రజక కాలనీలో , ఒకటి, రెండు వార్డులలో కృష్ణా జలాలు రాకపోవడంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చిట్యాల రోడ్డు నుండి మడేల్ గుడి పక్కన నుండి చౌటుప్పల్ రోడ్డుకు బైపాస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే మండల పరిషత్ కార్యాలయమును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట రాజు , గణేష్ , వంశీ , శ్రీకాంత్ , అయితగోని వెంకన్న , పాలంచి సైదులు , రాములు తదితరులున్నారు.
మునుగోడు – గుడిమల్కాపురం డబల్ రోడ్డును మంజూరు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES