Tuesday, April 29, 2025
Navatelangana
Homeక్రైమ్పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్య

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ-పెద్దపల్లి
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌ (40)ను ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌ కత్తితో మెడపై పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడితో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు