Wednesday, October 1, 2025
E-PAPER
Homeక్రైమ్రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో హత్య  దోపిడీ కేసు చేధన 

రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో హత్య  దోపిడీ కేసు చేధన 

- Advertisement -


నిందితుడిని అరెస్ట్ చేసిన ఒకటవ టౌన్ పోలీసులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2000 రూపాయల కోసం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి దోపిడీ చేసిన కేసును ఒకటవ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు బుధవారం 1వ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ ఆరవ తేదీ నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీనివాస కిరాణా షాప్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో, టౌన్-I పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా, దర్యాప్తులో భాగంగా, అనుమానితులను పట్టుకొని విచారణ చేపట్టామన్నారు. నమ్మదగిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ నిజామాబాద్ జిల్లా,కోటగిరి మండలం, జల్లపల్లి ఫారం (గ్రామం), కు చెందిన  షేక్ అహ్మద్ 32  ప్రస్తుతం రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితుడు షేక్ అహ్మద్ తను చేసిన నేరాన్ని అంగికరించి, అతను కేటరింగ్ రోజువారి కూలీ పనులు చేస్తూ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటూ, మద్యం అలవాటు కారణంగా డబ్బుల కోసం రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా కనిపించే వ్యక్తులను బెదిరించి, కొట్టి డబ్బులు దోచుకునే వాడిని అని తెలిపారు అన్నారు. అలాగే తేది 06.09.2025, రాత్రి 12.00 గంటల నుండి 2.00 గంటల మధ్యలో, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లక్ష్మీ లాడ్జ్ పక్కన శ్రీనివాస కిరాణా షాప్ ముందు ఒక పెద్దాయన డబ్బులు లెక్కబెడుతూ కనిపించగ, దాంతో అతనిని చంపివేసైన డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశ్యంతో అతని దగ్గరకు వెళ్లి డబ్బుల కోసం అతన్ని బెదిరించి కొట్టాడు. కానీ ఆ పెద్దాయన డబ్బులు ఇవ్వకపోవడంతో నిందితుడు ఒక బట్టతో అతని మెడకు ఉరి బిగించి హత్య చేసి, అతని వద్ద నుండి రూ.2,000/- నగదు, ఫోన్ దోచుకున్నానని చెప్పి తప్పును పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిపారు. హత్య చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -