Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మురుగు నీటితో విద్యార్థులకు వెతలు...

మురుగు నీటితో విద్యార్థులకు వెతలు…

- Advertisement -

  • పాఠశాలలోకి వెదజల్లుతున్న దుర్వాసన..

పట్టించుకున్న నాధుడే కరువాయే…

నవతెలంగాణ – భీంగల్

భీంగల్ మండలంలోని కస్తూర్బా పాఠశాల ముందు మురుగు నీరు చేరింది. కెజిబివి అనేది దేశంలోని బలహీన వర్గాల కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ బాలికల మాధ్యమిక పాఠశాల. కానీ విద్యార్థులు చదువుకునే పాఠశాల చుట్టూ పరిసరాల పరిశుభ్రత గాలికి వదిలేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ,,నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలకు ఆ మురికి నీళ్లలో నుంచి నడిచి వెళుతూ ఉపాధ్యాయులు, చిన్నారులు, అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులైన, పాఠశాలలో చదువుతున్న చిన్నారుల తల్లిదండ్రులైన పాఠశాలలో అడుగు పెట్టాలంటే ఆ మురికి నీటిలో నుండే రావలసిన దుస్థితి ఏర్పడింది. పాఠశాలలోని విద్యార్థులకు

దుర్వాసన వెదజల్లుతున్న వైనం. పాఠశాల పరిస్థితులు చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలని పాఠశాలకు పంపమంటే సంకోచిస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ముందు మురుగు నీరు పారుతున్న వైనం. కొద్దిపాటి కాలువ తీస్తే పడిన వర్షం నీరు నిలవకుండా వెళ్లే అవకాశం ఉన్నప్పటికి పట్టించుకున్న నాదుడే లేడని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad