Sunday, September 28, 2025
E-PAPER
Homeసోపతిమూసీ వరదలు- హైదరాబాదులో మూకీలు

మూసీ వరదలు- హైదరాబాదులో మూకీలు

- Advertisement -

అలనాటి హైదరాబాదు స్టేట్‌ లో బొంబాయితో సమాంతరంగా మూకీ సినిమాల చరిత్రకు 1896 లోనే బీజాలు పడినవి. ఈ మూకీ చరిత్రకు 1908లో సంభవించిన భయంకరమైన వరదలు కూడా హైదరాబాదు సైలెంట్‌ సినిమాల చరిత్రలో ఒక భాగంగా కనిపించడం ఒక ప్రత్యేకత. ఈ అంశం చాలామందికి విచిత్రంగానే అనిపించవచ్చు. ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్‌ (1896) నెలలోనే హైదరాబాదులో తొలి మూకీ సినిమాల ప్రదర్శన జరిగింది. అంతేకాకుండా ఈ సెప్టెంబర్‌ నెలలోనే హైదరాబాదులో తొలిసారిగా మూసీ వరదల భయానక దశ్యాలను చిత్రీకరించడం జరిగింది.

కాస్త చరిత్ర లోకి వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వద్దాం. లూమియర్‌ సోదరులు 1896 జూలైలో బొంబాయిలో మొదటిసారిగా భారతీయులకు సినిమాను పరిచయం చేశారు. ఆ తర్వాత మద్రాసు హైదరాబాదు బెంగళూరు కలకత్తా నగరాలలో సైలెంట్‌ సినిమాలను ప్రదర్శించిన తొలి విదేశీయుడు ప్రొ|| స్టీవెన్సన్‌. ఈయన 1896లో లూమీయరు సోదరులు బొంబాయికి రావడానికి కన్నా ముందే 1895లో మద్రాసు కు వచ్చి 167, మౌంట్‌ రోడ్‌ లో మద్రాసు ఫోటోగ్రాఫిక్‌ స్టోర్‌ అన్న దానిని నెలకొల్పి తొలిసారిగా స్లైడ్‌ ల రూపంలో ఒక ప్రదర్శనను యానిమేషన్‌ పద్ధతిలో నిర్వహించారు అక్కడే ఈ స్టీవెన్సన్‌ ఈయన ఫొటోల ప్రింటు కాగితాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకొని అమ్మేవాడు. మద్రాసులో తన ప్రదర్శనలు విజయవంతమైన తర్వాత ఆయన 1897లో దక్షిణ భారతదేశం అంతటా పర్యటిస్తూ తొలుత హైదరాబాదు నగరానికి వచ్చాడు అలా హైదరాబాదుకు వచ్చి 1897 ఆగస్టులో హైదరాబాదు జంట నగరాలలో మొట్టమొదటి సైలెంట్‌ చిత్రాల ప్రదర్శన ఇచ్చాడు.

ఈ ప్రదర్శనల గురించిన రిపోర్టులు 1897 ఆగస్టు 31 నాటి మద్రాస్‌ మెయిల్‌ దినపత్రికలో రిపోర్టు అయినది. స్టీవెన్సన్‌ హైదరాబాద్‌ లో నిజాం సమక్షంలోనే గాక పలువురు ధనవంతుల కుటుంబాల వారికి కూడా తన ప్రదర్శనలు ఇచ్చాడు. హైదరాబాదులో జరిగిన ఈ తొలినాటి మూకీల విషయాలన్నీ లండన్‌ నుండి వెలువడే సేజ్‌ పబ్లికేషన్స్‌ వారి బయోస్కోప్‌ 2010 సౌత్‌ ఆసియా స్క్రీన్‌ స్టడీస్‌ విభాగంలో స్టీఫెన్‌ హ్యూస్‌ అనే పర్‌ సినిమా పరిశోధకుడు తన ”వెన్‌ ఫిలిం కేమ్‌ టు మద్రాస్‌” అన్న అధ్యాయంలో వెలుగులోకి తెచ్చాడు. దీంతో హైదరాబాద్‌ సినిమా చరిత్రపైనే గాక దక్షిణభారత మూకీల చరిత్రపై కూడా కొత్త విషయాలు వెలికి వచ్చినవి. ఆశ్చర్యం కొలిపే విషయం ఏమిటంటే 1897 నాటికి సికింద్రాబాద్‌ నుండి మద్రాసుకు ముడి ఫిలిం సరఫరా అయినట్లు స్టీఫెన్‌ హ్యూస్‌ తన పరిశోధనలో తేల్చి చెప్పారు.

ఇదే స్టీఫెన్‌ హ్యూస్‌ 2010 ఫిబ్రవరి 14 నాటి హిందూ లో ”ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ బిగినింగ్‌ ”అన్న వ్యాసంలో స్టీవెన్సన్‌ హైదరాబాదుకు రాక మునుపే 1896 ఆగస్టు నెలలోనే సికింద్రాబాద్‌ నుండి చిన్నచిన్న మూకీలతో కూడిన పీప్‌ హౌల్‌ షోస్‌ మద్రాసు మీదుగా దేశమంతా వెళ్ళినట్టు రాశాడు. మద్రాసులో ‘సి ఆన్‌ ల్యాండ్‌’ పేర జరిగిన ఒక మేళాలో ఈ పీప్‌ హౌల్‌ షోస్‌ ప్రదర్శింపబడినవి. ఈ పీప్‌ హౌల్‌ షోలకు సంబంధించిన వార్తా కథనాలను అప్పటి మద్రాస్‌ మెయిల్‌ దినపత్రిక 1896 సెప్టెంబర్‌ 7 నాటిసంచికలో ప్రచురించారు. దీనితో హైదరాబాదులో 130 సంవత్సరాల క్రితమే సినిమా చరిత్ర ప్రారంభమైనట్టు తేటతెల్లమవుతున్నది.

The first people in Madras to experience
moving pictures would have
seen them one person at a time to a
peepwhole viewing machine with in a
fair ground setting. Oan such show
arrived in Madras from the cantonment
town of Secunderabad during the
first week 8 September 1896 without
great fanfare. And amusement fair
calling itself SEA ON LAND set up
on the Esplanade Maidan just opposite
the ordnance lines in Park Town. The
show was organised around what the
proprietor, S.C. Eaves, considered to
be the main attraction, which was a
team powered amusement ride on
mechanised boosts with full rigging.
Masts and sails “very much like the
pleasure boats of and English watering
place” (Madras Mail September 7,
1896 P1). Stephen Hughes, when film
came to Madras Bioscope South Asian
screen studies 2010

మరోవైపు సాంకేతిక పరంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిణామ వికాసాన్ని అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్‌ స్టేట్‌ ఆరవ నిజాం మీర్‌ మహబూబా అలీ ఖాన్‌ పాలన నాటికే ముందు వరుసలో ఉండింది. 1877లో థామస్‌ ఎడిసన్‌ కనుగొన్న ఫోనోగ్రాఫ్‌ పలు మార్పులతో 1890 నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అది భారత దేశంలోకి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. బొంబాయిలో ఉన్న వల్లభ దాస్‌ రంఛోర్‌ దాస్‌ అండ్‌ కంపెనీ 1902లో నెలకొని ప్రధానమైన దిగుమతి దారుగా ఫోనోగ్రాఫ్లను ఇండియాకు తెప్పించారు. దక్షిణ భారతంలో వ్రెన్‌ బ్రెనెట్‌ అండ్‌ కంపెనీ మద్రాసులో, హెచ్‌.ఎం. నిజామ్స్‌ డొమినియన్స్‌ సికింద్రాబాద్లో ఈ ఫోను గ్రాఫ్‌ ఏజెన్సీలను తీసుకున్నవి అలనాటి హైదరాబాద్‌ స్టేట్‌లో చాలామంది ధనవంతులు వీటిని కొనుగోలు చేశారు ఇక ఆరవ నిజాం సరేసరి. నిజాం స్టేట్లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్‌ గా పేరుందిన రాజా దీన దయాళ్‌ 1891 మే 22న నిజాం దర్బారులో ఈ ఫోనోగ్రాఫ్‌ ఇలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించగా అందరూ సంభ్రమాశ్చర్యపడ్డారు. ఆ సమయంలో నవాబ్‌ గాలిబ్‌ జంగ్‌ తన పరివారంతో ఫోనోగ్రాఫ్‌ ను వింటున్న ఫోటోలను దీన దయాల్‌ తీశారు కూడా. ఇంత సాంకేతిక పరిణామ వికాసాలు హైదరాబాదులో జరిగిన నేపథ్యంలో వీటి గాలి ఆరవ నిజాంకు సోకకుండా ఉండదు.

1896లో హైదరాబాదులో పురుడు పోసుకున్న పీప్‌ హౌల్‌ షోస్‌, తొలిమూక ప్రదర్శనలు ఆయన దష్టిలోకి రాకుండా ఉండిపోయే అవకాశం లేదు. కనుకనే 1908 సెప్టెంబర్‌ 28న హైదరాబాదును ముంచెత్తిన మూసి వరదల బీభత్స దశ్యాలను చిత్రీకరించడానికి ఆయన బొంబాయి నుండి జె.ఎఫ్‌. మదన్‌ బందాన్ని రప్పించాడు. ఆ బందం చిత్రీకరించిన దశ్యాలను ఆ తర్వాత ప్రజల కోసం బహిరంగ ప్రదర్శనలుగా వేసి చూపించారు. వీటి గురించి ఆ రోజుల్లో ప్రజలు కథలు, కథలుగా చెప్పుకునేవారు. మరికొందరు చరిత్రకారులు ఈ మూసి వరదల బీభత్స దశ్యాలను చిత్రీకరించింది జె.ఎఫ్‌. మదన్‌ కాదు. బొంబాయి కి చెందిన ఎక్సెల్సియర్‌ సినిమా ఫోనోగ్రాఫ్‌ సంస్థకు చెందిన ఒక కెమెరామెన్‌ వచ్చి ఈ దశ్యాలను చిత్రీకరించారని పేర్కొంటున్నారు. అయితే జేఎఫ్‌ మాత్రం బందమే వచ్చిందనడానికి బలమైన రుజువు ఏమిటంటే ఆ తర్వాత 1922లో సైలెంట్‌ చిత్రాలు నిర్మించడానికి కలకత్తా నుండి జె.ఎఫ్‌.మదన్‌ శిష్యుడు ధీరేన్‌ గంగూలీ హైదరాబాద్‌ రావడం.

జె.ఎఫ్‌. మదన్‌ కు ఆరవ నిజాంతో పరిచయం ఉన్నందుననే దాని కొనసాగింపుగానే ఏడవనిజం కలకత్తా నుండి ధీరేన్‌ గంగూలీని హైదరాబాదుకు మూకీ సినిమాలు తీయడానికి రప్పించాడు. మరోవైపు 1908లోనే బాబు పి.ఎస్‌. అనే ఒక అతను బయోస్కోప్‌ కంపెనీ పేర తెలంగాణలోనీ ఖమ్మం, నిజామాబాద్‌ ప్రాంతాలలో సైలెంట్‌ చిత్రాల ప్రదర్శన నిర్వహించాలని ఆయన కుమారుడు జయ సింగ్‌ 1980లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంటే రఘుపతి వెంకయ్య 1910లో మద్రాసులో సైలెంట్‌ చిత్రాల ప్రదర్శన ఇవ్వడానికన్న ముందే తెలంగాణలో సైలెంట్‌ చిత్రాల ప్రదర్శన జరిగినట్లుగా దీంతో తేటతెల్లమవుతుంది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే హైదరాబాదులో 1922లో దీరేన్‌ గంగూలి మొదటి సైలెంట్‌ సినిమాలు తీస్తే. అటు తెలుగు నేలపై 1925లో కాకినాడలో సి.పుల్లయ్య భక్త మార్కండేయ అనే సైలెంట్‌ చిత్రాన్ని తీశారు.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మద్రాసులో నిర్మాణమైన ఏ సైలెంట్‌ సినిమా కూడా నేడు భద్రపరచబడి లేదు కానీ 1929లో హైదరాబాదులో మహావీర్‌ ఫోటో ప్లేస్‌ వాళ్ళు నిర్మించిన ఫాదర్స్‌ లవ్‌ లేదా పిత ప్రేమ అన్న సైలెంట్‌ సినిమా నేటికీ బొంబాయి లోని ఫిలిం ఆర్కేస్‌ లో భద్రంగా ఉన్నది. హైదరాబాదులో మూకీల చరిత్రకు ఇంతకన్నా మరొక సాక్ష్యం అవసరం లేదు.
ఇలా భారతదేశంలోకి సినిమాలు వచ్చిన 1896 నుండి ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు హైదరాబాదులో సైలెంట్‌ చిత్రాల ప్రదర్శన, డాక్యుమెంటరీల చిత్రీకరణ వంటివి జరిగినవి.ఇవేవీ కూడా చాలా కాలం పాటు చరిత్రలో తెర మరుగుననే ఉండిపోయినవి. తెలుగు సినిమా చరిత్రకారులంతా హైదరాబాదులో సినిమాలో ఉనికి 1922లో ధీరేన్‌ గంగూలీ తోనే మొదలైంది అని చెబుతారు.

కానీ ధీరేన్‌ గంగూలీ కన్నా ముందు బొంబాయి,మద్రాసు, కలకత్తా నగరాలతో సమాంతరంగా హైదరాబాదులో జరిగిన సైలెంట్‌ చిత్రాల పరిణామ వికాసాలు కనిపిస్తాయి. 1922లో ధీరేన్‌ గంగూలీ వచ్చి రెండేళ్ల పాటు 8 సైలెంట్‌ చిత్రాలు తీశారు. ఆ తర్వాత 1929 నుండి 32 వరకు మహావీర్‌ ఫోటో ప్లేస్‌,నేషనల్‌ ఫిలిం కంపెనీ వంటి రెండు సంస్థలు ఏర్పడి మరొక 12 సైలెంట్‌ చిత్రాలు తీశారు.
ఇలా సినీ చరిత్రలో అన్నిట ముందున్న తెలంగాణ చరిత్రను మనం ఇప్పుడైనా గ్రంథస్తం చేసుకుని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడచిన పదేళ్లలో ప్రభుత్వం తెలంగాణ సినిమా రంగాన్ని చరిత్రను అశ్రద్ధ చేయడమే కాదు, అవహేళన కూడా చేసి అవమానించింది. ఇప్పటి ప్రభుత్వమైన ఆ వైపున తెలంగాణ సినీ చరిత్రను గ్రంథస్థం చేయించడానికి ముందుకు వస్తుందని ఆశిద్దాం.

హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -