Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు

మూసీ భూములు ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు

- Advertisement -

– బాధితులు లేకుండా కన్సల్టేషన్‌ ఎలా అవుతుంది
– పేదల పాలిట శాపంగా మారిన హైడ్రా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మూసీ ప్రక్షాళన పేరుతో పేదల నుంచి సేకరించిన భూములను ప్రపంచ బ్యాంక్‌కు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం యత్నిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూసీ పేరుతో సర్కార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. ”ఫేజ్‌ వన్‌ ప్రక్షాళనకు రూ.5,641 కోట్లు ఖర్చవుతాయని గతేడాది సెప్టెంబర్‌లో సీఎం చెప్పారు. కానీ మొన్నటి ప్రజెంటేషన్‌లో మాత్రం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఆరు నెలల్లోనే రూ.1400 కోట్లు ఎలా పెరిగింది? ప్రాజెక్ట్‌ లో ఇండ్లు కోల్పోయే వారిని పిలవకుండా వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నాయకులను పిలిచి ఏదో క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌ లా నిర్వహించారు. మూసీకి 16 నాలాల నుంచి మురుగు నీళ్లు వస్తున్నాయి. వాటిని ఏ విధంగా రాకుండా చేస్తారో చెప్పలేదు. వాటిని క్లీన్‌ చేయకుండా నాలుగు ఎస్టీపీలు కడితే ఏం లాభం? మల్లన్న సాగర్‌ నుంచి కాకుండా కొండపోచమ్మ సాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తీసుకొచ్చేందుకు రూ.7 వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బాధితులకు నష్ట పరిహారం, ఇండ్లు, లాంటి విషయాలను డీపీఆర్‌లో ప్రస్తావించలేదు” అని కవిత విమర్శించారు. గత ప్రభుత్వంలో మూసీ రివర్‌బెడ్‌లో నిర్మాణాలకు అనుమతివ్వని కేంద్రం ఇప్పుడెలా ఇచ్చిందని ప్రశ్నించారు. మూసీలో ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కబ్జాకు పాల్పడుతోందని తాను చేసిన ఆరోపణలను హైడ్రా కమిషనర్‌ తప్పుదోవ పట్టించేలా ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాటిని తొలగించకపోతే కోర్టులో డిఫర్‌మేషన్‌ సూట్‌ వేస్తానని హెచ్చరించారు. వెలుగుమట్ల బాధితులకు కేటాయించిన ఇండ్లలో సగం మంది కాంగ్రెస్‌ కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు. ఇండ్ల కేటాయింపుపై నిజ నిర్దారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 17న క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు ప్రజల ముందుంచుతామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -