Monday, February 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ది ఇండియా హౌస్‌'కి సంగీతం

‘ది ఇండియా హౌస్‌’కి సంగీతం

- Advertisement -

నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా నటిస్తున పాన్‌-ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. ఈ సినిమా షూటింగ్‌ శర వేగంగా జరుగుతోంది. వి మెగా పిక్చర్స్‌తో కలిసి ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2’ వంటి విజయ వంతమైన చిత్రాలను అందించిన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. రామ్‌చరణ్‌ సమర్పిస్తున్నారు. సాయి మంజ్రేకర్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రామ్‌ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ‘ధురంధర్‌, ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌, ఆర్టికల్‌ 370 చిత్రాలతో పాపులరైన బాలీవుడ్‌ స్టార్‌ కంపోజర్‌ శాశ్వత్‌ సచ్‌దేవ్‌ ఈ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్నారని మేకర్స్‌ ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఐదు ఆకట్టుకునే ట్రాక్‌లను కంపోజ్‌ చేశారని, పాటల చిత్రీకరణ అద్భుతంగా వచ్చిందని మేకర్స్‌ పేర్కొన్నారు.

1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిరతం విప్లవం, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతుంది. ‘మా కథానాయకుడు నిఖిల్‌ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను, ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ సినిమాతో కూడా ఆయన పంథాలో రాబోతున్నారు. ఇదొక విశేషమైతే, ఈ చిత్రానికి ‘ధురంధర్‌’ సంగీత దర్శకుడు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ అత్యద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయబోతున్నారు’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సమర్పణ: రామ్‌ చరణ్‌, నిర్మాతలు: అభిషేక్‌ అగర్వాల్‌, విక్రమ్‌ రెడ్డి, దర్శకత్వం: రామ్‌ వంశీ కృష్ణ, సహ నిర్మాత: మయాంక్‌ సింఘానియా, సంగీతం: శాశ్వత్‌ సచ్‌దేవ్‌, డీఓపీ : సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: విశాల్‌ అబానీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రజిని, కాస్టింగ్‌ డైరెక్టర్‌: ముఖేష్‌ చాబ్రా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -