Sunday, June 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌పై ట్వీట్‌ను తొలగించిన మస్క్‌

ట్రంప్‌పై ట్వీట్‌ను తొలగించిన మస్క్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై బహిరంగంగా ఆరోపణలు సంధిస్తున్న టెస్లా అధిపతి ఎలన్‌ మస్క్‌ శనివారం కొంత వెనక్కి తగ్గారు. ఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉన్నదంటూ సంచలన ట్వీట్‌ చేసిన మస్క్‌ దానిని తొలగించారు. తాను ఓ పెద్ద బాంబును పేలుస్తున్నానంటూ మస్క్‌ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఎప్‌స్టైన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉన్నదనీ, అందుకే వాటిని బహిర్గతం చేయడం లేదని ఆరోపించారు. ”ఈ పోస్టును భవిష్యత్తు కోసం భద్రపర్చుకో. నిజం బయటపడక తప్పదు” అని కూడా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ట్రంప్‌, మస్క్‌ మధ్య సామాజిక మాధ్యమ వేదికగా మాటల యుద్ధం నడిచింది. ‘ఉద్రిక్తతలను సడలించేందుకు మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడతారా’ అని బీబీసీ విలేకరి ప్రశ్నించగా ”ఆ మతిలేని మనిషితోనా” అని ట్రంప్‌ బదులిచ్చారు. మస్క్‌తో మాట్లాడాలన్న ఆసక్తిలేదని తేల్చి చెప్పారు. ”నేను మస్క్‌ గురించి ఏమీ ఆలోచించడం లేదు. ఆయనకు ఓ సమస్య ఉంది” అని సీఎన్‌ఎన్‌కు ట్రంప్‌ చెప్పారు. తాను లేకపోతే ట్రంప్‌ ఎన్నికలలో గెలిచి ఉండేవారే కాదని మస్క్‌ అన్నారు. సెనెట్‌లో డెమొక్రాట్లకు పట్టు ఉండేదని తెలిపారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు కూడా మస్క్‌ ప్రకటించారు. మరోవైపు, మస్క్‌కు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ వాగ్యుద్ధం నేపథ్యంలో మస్క్‌ తన ట్వీట్‌ను ఉపసంహరించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్‌, మస్క్‌ మధ్య మళ్లీ సయోధ్య కుదిరే అవకాశం ఉన్నదంటూ ఊహాగానాలు వినవస్తున్నాయి. న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -