Friday, May 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమస్క్‌కు మళ్లీ నిరాశే

మస్క్‌కు మళ్లీ నిరాశే

- Advertisement -

– స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం
– గాల్లోనే పేలిన మెగా రాకెట్‌
– వరుసగా ఇది మూడోసారి
వాషింగ్టన్‌:
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్‌ మస్క్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ రూపొందించిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. స్టార్‌షిప్‌ రాకెట్‌ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 7.36 గంటలకు టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్‌ తీరంలోని వేదిక నుంచి స్పేస్‌ఎక్స్‌ దీనిని ప్రయోగించింది. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలిదశలో బూస్టర్‌ ఈ రాకెట్‌ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ, స్పేస్‌ఎక్స్‌ కంట్రోలర్స్‌కు బూస్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం.. నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా.. సముద్రంలో పడిపోయింది. స్టార్‌షిప్‌ తన ప్రయాణాన్ని కొనసాగించి.. అంతరిక్షాన్ని చేరుకుంది. కానీ, నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత స్టార్‌షిప్‌ పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్‌షిప్‌ కూడా నియంత్రణ కోల్పోయింది. గింగిరాలు తిరుగుతూ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది. దీనిపై స్పేస్‌ఎక్స్‌ స్పందించింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. కాగా.. స్పేస్‌ఎక్స్‌ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాల్లోనూ ఈ భారీ రాకెట్లు గాల్లోనే పేలిపోయాయి వైఫల్యాలను మూటగట్టుకున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -