Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి

- Advertisement -

108 వాహనం తనిఖీ.!
పోగ్రామ్ జిల్లా  మేనేజర్ నశిరోద్దీన్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న 108 వాహనాన్ని 108 పోగ్రామ్ జిల్లా మేనేజర్ నశిరుద్దీన్, జిల్లా అధికారి రాజునాయక్ లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంబులెన్స్ లో మెడిసిన్స్,మెడికల్ ఎక్విప్మెంట్స్,రికార్డులు వాటిపై వేరిపై చేసి,వర్కింగ్ కండిషన్ చెక్ చేయడం జరిగిందన్నారు. అలాగెలాస్ట్ మూడు నెలల పని విధానంపై అంబులెన్స్ సిబ్బందితో విచారణ చేసినట్లుగా తెలిపారు. సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్డేట్ చేసుకుంటూ.. ప్రజలకు అందుబాటులో ఉంచుకొని కాల్ రాగానే తొందరగా బయలుదేరాలని ఆదేశించి, పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై అవగాహన నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ భాస్కర్ ను కలిసి 108 సేవల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జి.మహేష్, పైలెట్ సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -