Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలోనే కొనసాగించాలి : హైకోర్టు

తెలంగాణలోనే కొనసాగించాలి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐపీఎస్‌ అధికారి అభిలాష్‌ బిస్త్‌ను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన ఏపీ కేడర్‌ కేటాయింపు ఉత్తర్వులను సమర్థిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన తీర్పును అభిలాష్‌ బిస్త్‌ సవాలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ పి. శ్యాంకోశీ, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు డివిజన్‌ బెంచ్‌ విచారించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదిస్తూ, సీనియార్టీ లిస్ట్‌కు భిన్నంగా అన్యాయంగా ఏపీకి కేటాయించారన్నారు. 1994లో మొదట పశ్చిమ బెంగాల్‌ క్యాడర్‌కు ఆమెను కేటాయించారనీ, అటుపిమ్మట ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిని వివాహం చేసుకోవడంతో 1997లో కేంద్రం ఆమెను ఏపీ క్యాడర్‌కు మార్చిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -