- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మన చుట్టూ తిరుగుతున్న పక్షులపై అవగాహన కలిగివుండాలని ఎఫ్ఆర్ఓ పుండలిక్ అన్నారు. సోమవారం మండలంలోని దేగామ చెరువు వద్ద వివిధ రకాల వలస వచ్చిన పక్షుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చిత్తడి నేలల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, వివిధ రకాలైన పక్షుల గురించి వివరించారు, విద్యార్థులు పలు రకాల పక్షులను వీక్షిస్తూ తమ ఆనందంను వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, ఎఫ్బివో లు కేశవ్, ఈశ్వర్, జ్ఞానేశ్వర్, తిరుపతి, ఉపాధ్యాయులు, అటవీశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



