చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య  ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జులై 1, 2024 నుండి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పాత చట్టాలాను సవరించి మూడు కొత్త చట్టాలను రూపొందిచారని, కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐ.పి.సి, సి.ఆర్.పి.సి చట్టాలు రద్దయ్యాయని వీటి స్థానంలో  భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలు అమలులోకి వచ్చాయని ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్
జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని వివరించారు. ప్రస్తుతం ఉన్న యుగంలో నూతన చట్టాలపై జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, జనరల్ గా వ్రాసే వార్తలకు, క్రైమ్ వార్తలకు చాలా తేడాగా ఉంటుంది. అయితే క్రైమ్ వార్తల విషయంలో తప్పనిసరిగా పలు సూచనలు జాగ్రత్తలు పాటించాలి. మైనర్లకు సంబంధించిన కేసులలో వారి పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటివైనా రాయకూడదని సూచించారు. తప్పనిసరిగా సంబంధిత అధికారి వివరణ తీసుకొని వార్తను ప్రచూరించాలి. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు కు శిక్ష తప్పనిసరిగా అమలవుతుందన్నారు. సోషల్ మీడియాలో ఏవైనా ఫోటోలు గాని వీడియోలు గాని పోస్టుచేసే ముందు ఎవరిదైతే వీడియో, ఫోటోలు తీసుకుంటున్నాము వారి అనుమతి తప్పని సరిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎ.ఐ యుగంలో ఉన్నందున ఉన్నది లేనట్టుగా మన ముందు చూపించవచ్చు, కానీ అది కరెక్టా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తరువాతే ప్రచూరిస్తే బాగుంటుంది అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి కానీ దానిని దుర్వినియోగం చేయకూడదు. ఎవ్వరయిన దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా జైలులో జీవితం గడపాల్సి ఉంటుంది అని తెలిపారు. ఈ అవగాహణ కార్యక్రమం పూర్తిగా పవర్పాయింటు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ
సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎల్.రాజా వెంకట్ రెడ్డి, జె. వెంకటేశ్వర్ రెడ్డి, పి. శ్రీనివాస్, మస్తాన్ అలీ, రూరల్ ఎస్.ఐ ఎమ్.డి ఆరీఫ్ఉద్దీన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.