Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి

రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి

- Advertisement -

– ఎన్నో కలలు గని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం : హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలకనుగుణంగా అందరం కలసి పని చేయాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ సూచించారు. ఎన్నో కలలు గని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, ఆ కలలు సాకారం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయం ముందు జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఔటర్‌ రింగు రోడ్డు వరకూ పరిధిని నిర్దేశించి హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడంతోపాటు, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండేలా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. ఆ దిశగా అందరూ కలసి పని చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గీతం చాటి చెబుతోందని తెలిపారు. ఆ లక్ష్యాలు నెరవేరేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img