Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మ్యూటేషన్ దరఖాస్తు మాయం.!

మ్యూటేషన్ దరఖాస్తు మాయం.!

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
ధర్మారావుపేట సొసైటీ భూమి  మ్యుటేషన్ కోసం గత 5 సంవత్సరాలుగా గ్రామస్తులు పోరాటం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు ఇప్పటి వరకు పనిచేసిన 4 కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటికీ మ్యుటేషన్ కావడం లేదు.  ధరణి పోర్టల్ ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న ఫైల్  దొరకడం లేదు. గత మే నెలలో ధరణి పోర్టల్ లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయడమైనది  భూమి నలుగురి పేర్ల మీద ఉండడంతో నాలుగు దరఖాస్తులు చేయడం జరిగింది. అందులో రెండు దరఖాస్తులు 0- 05 గుంటల చొప్పున పది గుంటల వేరే వ్యక్తుల వద్ద భూమి ఉందని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని రిజెక్ట్ చేశారు.

మిగతా రెండు దరఖాస్తులలో  ఇంకా మ్యుటేషన్ కాకపోవడంతో  MRO కార్యాలయంలో అడిగితే RDO కార్యాలయo పంపించమని , RDO కార్యాలయ అధికారులను అడిగితే ఇక్కడ ఒక్కటే  ఫైల్ ఉంది ఇంకో ఫైల్ లేదని దాన్ని తిరిగి MRO కార్యాలయం పంపించమని చెబుతున్నారు. మహిపాల్ యాదవ్ ఎంపీటీసీ గెలిచినప్పటి నుండి పోరాడుతున్న మొదట్లో అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాయం చేశారు. SRO ఆఫీస్ లో దరఖాస్తు చేసి వెతికించి తెచ్చిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం మ్యుటేషన్ చేసుకోవడానికి ఎందుకు అలసత్వం చేస్తోందో అర్థం కావడం లేదు. గతంలో ఒక MRO అయితే సొసైటీ భూమి గురించి నీకెందుకు దాని గురించి సొసైటీ వాళ్ళే అడగాలి అని మొహం మీదనే చెప్పిండం జరిగిన దని శనివారం తలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -