Tuesday, October 7, 2025
E-PAPER
Homeసినిమాఅద్భుతమైన స్క్రీన్‌ప్లేతో 'మటన్‌ సూప్‌'

అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ‘మటన్‌ సూప్‌’

- Advertisement -

డిఫరెంట్‌ కథా కథనాలతో రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ హీరో, హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్‌ సూప్‌’. ‘విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్‌, శ్రీ వారాహి ఆర్ట్స్‌, భవిష్య విహార్‌ చిత్రాలు బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్‌), రామకృష్ణ సనపల, అరుణ్‌ చంద్ర వట్టికూటి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 10న థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో మంగళవారం మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ వశిష్ట ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మటన్‌ సూప్‌’ టైటిల్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ బాగుంది. ట్రైలర్‌ ఎంత బాగుందో.. సినిమా కూడా అంత పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

‘నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నిర్మాతలకు థ్యాంక్స్‌. అందరూ మా చిత్రాన్ని చూసి సపోర్ట్‌ చేయండి’ అని రామచంద్ర వట్టికూటి అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ, ‘ఈ సినిమాని నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ, ‘మా అమ్మ కలను ఆడియెన్స్‌ ముందుకు ఈనెల 10న తీసుకు వస్తున్నాం’ అని చెప్పారు. ‘మన చుట్టూ జరిగే కథల్నే అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో రామచంద్ర చూపించారు’ అని మరో నిర్మాత రామకృష్ణ సనపల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -