రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్.
మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘మా చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావుకి ధన్యవాదాలు. మంచి చిత్రంతో త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాం. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) చెప్పారు. హీరో రమణ్ మాట్లాడుతూ, ‘నా ఫ్రెండ్ రామచంద్ర మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా అద్భుతంగా వస్తోంది’ అని తెలిపారు.
దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ”మటన్‌సూప్’ అనే టైటిల్‌ని ఎందుకు పెట్టామనేది తెలియాలంటే వెండితెర మీద చూడాల్సిందే’ అని అన్నారు. నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ, ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించాం’ అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా : భరద్వాజ్, ఫణీంద్ర, మ్యూజిక్ : వెంకీ వీణ, ఎడిటింగ్ : లోకేష్ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు.
రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘మటన్‌సూప్’
- Advertisement -
- Advertisement -