Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి ముయ్యలమ్మ తల్లి జాతర 

రేపటి నుంచి ముయ్యలమ్మ తల్లి జాతర 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని పసర గ్రామంలో మేడారం సమ్మక్క తల్లి మేనకోడలైన శ్రీ ముయాలమ్మ తల్లి జాతర రేపటినుండి ప్రారంభం కానుంది. సోమవారం పసర గ్రామంలో గొంది వంశీయుల ఇలవేల్పు ముయ్యాలమ్మ తల్లి జాతర తలపతి గొంది నరసయ్య మీడియాతో మాట్లాడారు. జాతర ఈనెల 11న ప్రారంభమై 14 తో ముగుస్తుందని అన్నారు.

ఈ నెల 11 బుధవారం మండ మెలుగుట పాన్పు తెచ్చుట కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహించనున్నట్లు, 12 న గురువారం ఉదయం వనం తెచ్చే కార్యక్రమం సాయంత్రం గుట్ట నుండి అమ్మవారిని తీసుకొని వచ్చి గద్దెపై ప్రతిష్టింపజేయడం జరుగుతుందని ఉంటుందని, 13 శుక్రవారం తల్లికి ముక్కులు చెల్లించే కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరిగి 14 న శనివారం తల్లిని కోనప్రవేశం చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గొంది రాజు గొంది రామచందర్ గొందివంశీయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -