- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని.. ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. గురువారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ‘విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్ స్పీకర్‌కు లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్‌ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. వాళ్లు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమీ భయపడను’ అని అన్నారు.
- Advertisement -



