Wednesday, August 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మంత్రి ప‌దవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మంత్రి ప‌దవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇవాళ హైదారాబాద్‌ మీడియా చిట్‌చాట్‌లో హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితో తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా మూడున్నరేళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని.. ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లుగా సీఎం తీరు ఉందని అన్నారు. త‌న‌కు మంత్రి పదవి ఇస్తానని చెప్పింది ఐసీసీ అని.. ఇందులో త‌న‌ అన్న కోమటి‌రెడ్డి వెంకట్‌ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రధాన పత్రిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ రావడం లేదని.. ఇకనైన ఆయన తన పదవికి రాజీనామా చేస్తే బెటర్ అని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని.. అందుకే కాళేశ్వరం విషయంలో తమ ప్రభత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇంకా కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ తానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే.. కేసీఆర్ ఏనాడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -