‘తెలుసు కదా’లో నేను చేసిన వరుణ్ క్యారెక్టర్ ఒక ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేస్తుంది. తను మామూలుగా ఉన్నప్పటికీ తన ఆలోచనలు చాలా రాడికల్‌గా ఉంటాయి. నా క్యారెక్టర్ సినిమాలో 23 నిమిషం తర్వాత ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుంది’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. ‘మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. దర్శకురాలు నీరజ చెప్పిన కథలో ఒక యూనిక్ నెస్ ఉంది. కథ చాలా బాగుంది. దానికి తగ్గట్టు క్యారెక్టర్జేషన్స్ ఉన్నాయి. ఇందులో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుంది. కచ్చితంగా ఆడియన్స్‌ని షాక్ చేస్తుందని నమ్ముతున్నాను. అలాగే మంచి హ్యుమర్ కూడా ఉంటుంది. ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమా మీద అద్భుతమైన బజ్ వచ్చింది.
మేం ఏదైతే చూసి ఎక్సైట్ అయ్యామో, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ఇందులో మీరు 80% కొత్త సీన్స్ చూస్తారు. లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, ఫ్యామిలీ రిలేషన్ షిప్ గురించి డిస్కర్షన్ ఉంటుంది. కానీ ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ నీరజ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో వచ్చారు. రాశి, శ్రీనిధి క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికంటూ ఒక జోనర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. సినిమాలో లవ్, లైఫ్ గురించి డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. విశ్వ, కృతితో నాకు మంచి అనుబంధం ఉంది. దేనికి వెనకడుగు వేయరు. జ్ఞాన శేఖర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్. ఎడిటర్ నవీన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవినాష్ గ్రేట్ సెట్ వర్క్ చేశారు. నీరజ ఫస్ట్ టైమర్ అయినప్పటికీ వీళ్ళ అందరితో కలిసి అద్భుతమైన అవుట్‌ఫుట్ ఇచ్చారు.
నా క్యారెక్టర్ షాకింగ్‌గా ఉంటుంది
- Advertisement -
- Advertisement -