Monday, November 17, 2025
E-PAPER
Homeకరీంనగర్నా పాణం మంచిగ లేదు.. మన ఊరికి వస్తా

నా పాణం మంచిగ లేదు.. మన ఊరికి వస్తా

- Advertisement -

గల్ఫ్ బాధితుడి కన్నీటి పర్యంతం..
ఆదుకోవాలని సోషల్ మీడియాలో వేడుకోలు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

కొద్దిరోజులుగా నా ప్రాణం మంచిగా లేదు.. నాకు ఇక్కడ ఉండబుద్ధి అవతలేదు.. నేను మన ఊరికి వస్తా.. నన్ను ఆదుకోవాలిని ఓ గల్ఫ్ కార్మికుడు సోషల్ మీడియా ద్వారా వేడుకోవడంతో వైరల్ గా మారింది. బతుకు దెరువు కోసం పరాయి దేశానికి వలస వెళ్లిన ఓ పేద కార్మికుడు తన ఆరోగ్యం సహకరించడం లేదని.. తనను స్వగ్రామానికి వచ్చేలా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆదివారం సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బాలసాని సత్తయ్య ఇటీవల బతుకు జరుగు కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. అయితే పొట్ట కూటి కోసం దేశం కానీ దేశం వెళ్తే ఆరోగ్యం క్షీణించి పనిచేసే పరిస్థితి లేదని, తిరిగి ఇంటికి రావాలంటే డబ్బులు లేని పరిస్థితి ఉందని వాపోయాడు. ఇక్కడ పనిలో చేరిన కంపెనీకి డబ్బులు చెల్లించడంతోపాటు స్వదేశానికి వచ్చేందుకు టికెట్ కోసం డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాతల స్పందించి తనను స్వదేశానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని కన్నీటి పర్యంతమవుతూ సోషల్ మీడియాలో వేడుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -