– పెద్దపల్లి కలెక్టరేట్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం
– కలెక్టర్ సమక్షంలో ఘటన
– వెంటనే ఆస్పత్రికి తరలించిన సిబ్బంది
నవతెలంగాణ – పెద్దపల్లి
విధి నిర్వహణలో తండ్రి మరణించగా.. ఆ ఉద్యోగం కోసం అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పెద్దపల్లి కలెక్టరేట్‌లో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడిని గమనించిన సిబ్బంది వెంటనే అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. అతను కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్‌గా గుర్తించారు. కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేసిన సతీష్ తండ్రి.. విధి నిర్వహణలో పాము కాటుకు గురై ప్రాణం కోల్పోయాడు. తండ్రి మరణం అనంతరం అతడి ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని సతీష్ పలుమార్లు అధికారులను వేడుకున్నాడు. కానీ, ఎలాంటి స్పందనా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే క్రమంలో కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
తండ్రి ఉద్యోగం తనకివ్వడం లేదని..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES