ఒక అవకాశం ఇవ్వండి అందుబాటులో ఉంటా.. అభివృద్ధి చేస్తాం
నన్ను గెలిపిస్తే గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామగా చేస్తా …పాగె ఆమనీ -సురేష్
నవతెలంగాణ – కాటారం
ఒకసారి అవకాశం ఇవ్వండి రేగులగూడెం గ్రామపంచాయతీ లోని యువతకు ఉపాధి అవకాశాలు మన గ్రామం లోనే కల్పించేలే ప్రణాళికలు చేస్తానని, అభివృద్ధి పథంలో నడిపి చూపిస్తానని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రేగులగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాగె ఆమనీ – సురేష్ అన్నారు. గ్రామ పంచాయితిలో అందరి దోస్తు గా పేరు గాంచి సమర్థుడుగా గుర్తింపు సొంతం చేసుకొని, ఉనత విద్య వంతుడు అందరి బాధలు తెలిసిన వాడు రేగులగూడెం సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు. గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు కావాలి అంటే పాగె ఆమనీ – సురేష్ ను గెలిపించాలి. అని గ్రామస్తులు భావిస్తున్నారు. స్థానిక ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా బుదవారం గ్రామంలో ఘనంగా ర్యాలీ నిర్వహించి ఇంటింటా ఓటర్లను అభ్యర్థిస్తూ ఘనంగా ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నా లక్ష్యం యువతకు ఉపాధి , ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసుకుని పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. నా తపన ప్రజలకు సేవ చేయడమే, నా లక్ష్యం అని ప్రజలకు మాట ఇచ్చారు. ప్రజల అండ దండాలు ఆశీర్వాదం అందించి భారీ మెజార్టీతో గెలిపిస్తే అందరి సహకారంతో గ్రామానికి రావలసిన నిధులను తెచ్చి మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రకటించారు. నాయకులతో కార్యకర్తలతో ఆయన కలిసి నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి గ్రామస్థుల,యువకుల నుండి బారి స్పందన వస్తుంది.
నా మొదటి లక్ష్యం యువతకు ఉపాధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



