Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీరామగిరి గ్రామ అభివృద్దే నా లక్ష్యం 

శ్రీరామగిరి గ్రామ అభివృద్దే నా లక్ష్యం 

- Advertisement -

శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

శ్రీరామగిరి గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారమే నా లక్ష్యమని ఆ గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ అన్నారు. సోమవారం ఆ గ్రామంలోని డాక్టర్ కాలనీ లో కనీసం నడవడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో డాక్టర్స్ కాలనీ అని పిలువబడే వీధిలో ప్రజలు నడవడానికి మరియు బైకులు కార్లు పోవడానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దానిని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదని దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు.

వెంటనే గెలిచిన 15 రోజుల్లోనే దీన్ని ఈ సమస్య లేకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం  దాదాపు గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమస్య ను సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న 10 రోజుల లోపే పనులు ప్రారంభించానని అన్నారు. గ్రామంలోని ఏ వీధిలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ సమస్య ఉండకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -