నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామాల్లో మౌళిక సదుపాయాలు తో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, అశ్వారావుపేట నియోజకవర్గం సమగ్రాబివృధ్ధే లక్ష్యం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. అన్ని రంగాలలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ఆయన బుధవారం నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించి వినాయకపురం,ఆసుపాక నందిపాడు,కోయరంగాపురం,గుమ్మడపల్లి,బచ్చువారిగూడెం, నారాయణపురం,గాండ్లగూడెం, అనంతారం,మళ్ళాయిగూడెం కేశప్పగూడెం,ఊట్లపల్లి, అశ్వారావుపేట మున్సిపాలిటీ,పాతనారవారిగూడెం,మద్దికొండ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లను అధికారికంగా ప్రారంభించారు.అదేవిధంగా కొత్తగా నిర్మించబోయే సీసీ రోడ్లకు శంకుస్థాపనలు కూడా చేశారు .కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశార.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు గారు ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు గారు జూపల్లి ప్రమోద్ గారు పంచాయతీరాజ్ డిఇ శ్రీధర్ గారు ఏఈ అక్షిత గారు ఆర్డబ్ల్యూఎస్ డిఈ సాల్మన్ గారు ఏఈ సతీష్ గారు అంగన్వాడీ అధికారులు సర్పంచులు ఉపసర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



