Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం 

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం 

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగు
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు  శ్రీకారం
నవతెలంగాణ – ఆలేర్ రూరల్

నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల సహకారంతో చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం నాడు ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం, శివలాల్ తండా, టంగుటూరు, శారాజీపేట, మదనపల్లి, శర్బనాపురం, రాఘవాపురం ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సిసి రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమల్లో చిత్తశుద్ధి చూపెడుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తేల్చిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఆలాగే రైతుల అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తూ వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసిబిడ్డ అయినా బీసీల కోసం 42 శాతం రిజర్వేషన్ తెచ్చిన ఘనత ఆయనదని చెప్పారు.

గతంలో బిఆర్ఎస్ పాలన 55% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ బీసీలకు మించ కూడని స్లాబ్ తీసుకువస్తే దాన్ని తిరగరాసి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన ఘనత కాంగ్రెస్ అన్నారు. రాబోయే  అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి  వస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కింది అన్నారు. మరొక గ్యారెంటీ అతి త్వరలో సహకారం కానున్నదని తెలిపారు.

చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి,జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు కొండ్రాజు వెంకటేశ్వర రాజు, మాజి ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపిటిసి ఆరే ప్రశాంత్ గౌడ్, మండల శాఖ అధ్యక్షురాలు గ్యారపాక దీప, గ్రామశాఖ అధ్యక్షులు చౌడబోయిన మహేందర్, కేతావత్ నరేష్, నోముల వెంకటేష్, కంత నాగరాజు, మద్దూరి ఐలయ్య, బుగ్గ నరేష్ , మధు ,భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -