Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంథని అభివృద్ధే నా ధ్యేయం: మంత్రి శ్రీధర్ బాబు

మంథని అభివృద్ధే నా ధ్యేయం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సరస్వతి నిలయంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఎవరు ఎన్నన్న వారి చిల్లర మాటలు పట్టించుకోనని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంథని క్యాంపు కార్యాలయంలో రామగిరి కమాన్పూర్ మంథని ముత్తారం మండలాలకు సంబంధించి 87 మంది లబ్ధిదారులకు సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు, 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి వారంలోనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకాలంలో వేతనాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే చెక్కులు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -