Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వస్త్రం తండాను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: సర్పంచ్

వస్త్రం తండాను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ- నెల్లికుదురు 
మండలంలోని వస్త్రం తండాను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే నా లక్ష్యం అని ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు కరుణ మధు తెలిపారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ సహకారంతో ఈజీఎస్ నిధుల ద్వారా ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూక్య బొందాలు ఇంటి నుండి భూక్యా భోజ్య ఇంటి వరకు బురదమయం లేకుండా  ఉండేందుకు సీసీ రోడ్డును పోస్తున్నామని అన్నారు.

గ్రామంలో అన్ని వీధులలో సీసీ రోడ్డు పనులను చేసి గ్రామం బురద లేని గ్రామంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు వీధిలైట్లు త్రాగునీరు సిసి రోడ్లు సైడ్ కాలువలు పారిశుద్ధ్య పనులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం నా లక్ష్యం అని అన్నారు. అవసరమైతే మా పై ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీ బలరాం నాయక్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సహకారం తీసుకొని అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానస సురేందర్ ,వార్డు సభ్యులు భూక్య బాలాజీ, గుగులోతు రమేష్, గుగులోతు శేలా, గుగులోతు మల్సూర్, గుగులోతు యాకూబ్ ,గుగులోతు రవి ,నాయకులు భోజ్య ,హరిచంద్రు ,వీరన్న, రెడ్యా, కిషన్, తోపాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -