-మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్
నవతెలంగాణ- రాయపోల్
నిరుపేద ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యమని, పేద ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బట్టలను నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుందని. అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా హిందువులకు బట్టలను అందజేయడం జరుగుతుందన్నారు.
తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడంతో ఎంతో సంతోషం కలిగిస్తుందని గుర్తు చేశారు. తాను ఓట్ల కోసం రాలేదని పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సహాయం అందించేందుకు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేదలకు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని గత ప్రభుత్వ ఆయాయంలో కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని తెలిపారు. పదవులు వస్తాయి పోతాయనిపేద ప్రజలకు సేవలు చేయడం తాను ఎప్పుడు మరువనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లింగయపల్లి యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్, రాజిరెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, చింతకింది మంజూర్, ఫలేంద్రం, స్వామి, దయాకర్ రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.