Monday, June 9, 2025
E-PAPER
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌తో'మై లవ్‌'

భిన్న కాన్సెప్ట్‌తో’మై లవ్‌’

- Advertisement -

మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో కిషోర్‌ తేజా, సాత్విక లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘మై లవ్‌’ ఆల్బమ్‌ సాంగ్‌ గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది.
ఎస్‌కేటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వాకాడ అప్పారావు ఈ ఆల్బమ్‌ని నిర్మించారు.
హీరో కిషోర్‌ తేజ మాట్లాడుతూ,’మా డైరెక్టర్‌ రామ్‌ రెడ్డి ఈ పాటని చాలా అద్భుతంగా చేశారు. మా డీవోపీ జయపాల్‌ రెడ్డి అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. టీమ్‌ సహకారంతో సాంగ్‌ అద్భుతంగా వచ్చింది. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రాంతి చాలా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. మా నిర్మాత వాకాడ అప్పారావు చాలా సపోర్ట్‌ చేశారు’ అని తెలిపారు. ‘మంచి కంటెంట్‌తో తీస్తే ఆడియన్స్‌ ఎప్పుడు కూడా మంచి వ్యూస్‌ ఇస్తారు. ఈ సాంగ్‌ని కూడా సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ రామ్‌ రెడ్డి చెప్పారు. కథానాయిక సాత్విక మాట్లాడుతూ, ‘ఈ సాంగ్‌ ఇంత అద్భుతంగా రావడానికి కారణం కంటెంట్‌. భిన్న కాన్సెప్ట్‌తో అందరీ సపోర్ట్‌తో ఈ పాటని మీముందుకు తీసుకొస్తున్నాం. ఇంత మంచి పాటలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -