ఆభరణాలు అందాన్ని పెంచడంలోనే కాదు వారికి ఆర్థిక భద్రత కల్పించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. బంగారు నగల విషయానికి వస్తే భారతీయ మహిళలు పెట్టుబడులు పెట్టే సమయంలో నగలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో నగలపై భారతీయుల టేస్టు మారుతోంది.
నిన్న మొన్నటి వరకు సంపన్న వర్గాలకే పరిమితమైన ‘ప్లాటినం’ నగలు, ఇపుడు మధ్య తరగతి వర్గాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్లాటినం ధర బంగారం కంటే తక్కువగా ఉండడమే కారణం. విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ప్లాటినం ఆభరణాలు నేడు దేశంలోని ప్రధాన నగరాల్లోకి ప్రవేశించాయి. ప్రధాన జ్యుయలరీ షోరూమ్‌లలో ప్లాటినం ఆభరణాల అమ్మకాలు పెరుగుతున్నాయి. పెరిగిన అమ్మకాలకు తగినట్లే కొత్త కొత్త డిజైన్లతో, వివిధ మోడల్స్‌లో ప్లాటినం నగలు షాపుల్లో కొలువు తీరుతున్నాయి. ప్లాటినం మొదట కొలంబియాలోని రియో పింటో చివరన ఉన్న ఒండ్రు నిక్షేపాల నుండి కనుగొనబడిందని చెబుతారు. ‘ప్లాటినం’ అనే పేరు ఈ లోహానికి స్పానిష్ దేశస్థులు ఇచ్చిన పేరు నుండి వచ్చింది, ఎందుకంటే ఇది వెండిని పోలి ఉంటుంది కాబట్టి దీనిని ‘ప్లాటినా డెల్ పింటో’ అని పిలిచారు. శతాబ్దాల నుండి రాజవంశం ద్వారా పశ్చిమ దేశాలలో ఆభరణాలలో ప్లాటినం బాగా ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి, టిఫనీ, కార్టియర్ మరియు ఫాబెర్జ్ వంటి ప్రముఖ ఆభరణాల వ్యాపారులు చాలా కాలం పాటు ప్లాటినం డిజైన్లను రూపొందించారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలు – కోహినూర్ మరియు హోప్ కూడా ప్లాటినంలో అమర్చబడి ఉన్నాయి.
20వ శతాబ్దం ప్రారంభంలో ప్లాటినం ఒక ప్రముఖ లోహంగా మారింది. 1930ల వరకు అది అలాగే ఉంది. ప్లాటినం బంగారం కంటే ఖరీదైనది. ఆభరణాలు, ఆటోమోటివ్, పారిశ్రామిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఇది అరుదైన లోహం కాబట్టి, ప్లాటినం అధిక ధరను కలిగి ఉంటుంది. క్యాన్సర్ నిరోధక మందులు, హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, ఎరువులు, గ్యాసోలిన్, కళ్ళద్దాలు, LCD డిస్ప్లేలు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, పెయింట్స్ పేలుడు పదార్థాలు వంటి వివిధ అధిక డిమాండ్ ఉన్న వస్తువులలో ప్లాటినం ఉపయోగించబడుతుంది. ప్లాటినం అందమైన సహజమైన గ్రే-వైట్ కలర్ మెటల్‌కు మెరుపును ఇస్తుంది. దానిలో అమర్చిన వజ్రాలు పెద్దవిగా కనిపిస్తాయి. హైపోఅలెర్జెనిక్ మెటీరియల్ – ఆభరణాలలో ఉపయోగించే ప్లాటినం సాధారణంగా 90 నుండి 95% స్వచ్ఛమైనది. చర్మ అలెర్జీలను ప్రేరేపించే చాలా తక్కువ అల్లారు మెటల్‌తో ఉంటుంది. చాలా ప్లాటినం నగలలో నికెల్ ఉండదు. ప్లాటినం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది శాశ్వత ప్రయోజనాలను అందిస్తుంది. 95% (Pt 950) స్వచ్ఛతతో, ప్లాటినం బంగారం కంటే బలంగా దట్టంగా ఉంటుంది, దీనికి తెల్ల బంగారం లాగా రీప్లేటింగ్ అవసరం లేదు. దాని సహజ పూత కాలక్రమేణా దాని లక్షణాన్ని పెంచుతుంది.
భారత్‌లో ప్లాటినం అమ్మకాల్లో వద్ధి అంచనా సానుకూలంగా కనిపిస్తోంది. ప్లాటినం అమ్మకాల్లో కొనుగోలుదార్ల స్వభావాన్ని బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో ప్లాటినం వాడకం భారత సంస్కతిలో భాగంగా మారుతోంది. ముఖ్యంగా యువత వారివారి జీవితంలో ముఖ్య ఘట్టాలకు గుర్తుగా చేసుకునే సంబురాల్లో భాగంగా ప్లాటినం నగలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. వీటిలో ముఖ్యంగా ప్లాటినం లవ్ బ్యాండ్‌ల హవా ఎక్కువగా కొనసాగుతోంది. గతంలో లేని విధంగా అనేక వెరైటీలు అందుబాటులోకి రావడం కూడా ప్లాటినం నగల అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని నగల వ్యాపారులు చెపుతున్నారు గతంలో ప్లాటినం నగలంటే లవ్ బ్యాండ్లు, ఉంగరాలు, ఇంకా ఇతర చిన్న చిన్న నగలు మాత్రమే. ఇపుడు బంగారు నగల్లా, ప్లాటినంతో చేసిన అనేక రకాల నగలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లోని చాలా మంది యువతీ యువకులు ఈ నగలు కొనడం ప్రారంభించారు.
యువత బంగారం అనేదానిని ఆభరణాలుగా ధరించే విధానంగా కాకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా భావిస్తున్నారు. అందుకే గోల్డ్ బాండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపారవర్గాలు చెబు తున్నాయి. ప్లాటినం ఆభరణాల మేకింగ్ చార్జీ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ప్లాటినం ముక్క బంగారం కంటే చౌకగా ఉంటుంది. అందుకే బంగారానికి బదులు ప్లాటినం కొనడం మంచిదని ప్రజలు భావిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ సైతం దేశంలో ప్లాటినం నగల అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసిందని నగల వ్యాపారులు చెపుతున్నారు. నెట్ చూసే యువతీ యువకుల్లో ఎక్కువ మంది అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా ప్లాటినం నగలపై మోజు చూపుతున్నారు. వీరంతా సరికొత్త డిజైన్లలో లభించే ప్లాటినం నగలపై ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్‌లో ప్లాటినం నగలకు మరింత డిమాండ్ ఉంటుందని కూడా అంచనా.
సాదాసీదా పూసలతో జతకట్టిన ప్లాటినం, వెండి నగలు మగువల మనసులను దోచేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రధారణకు, వెస్ట్రన్ వేర్‌కు ఇవి బాగా నప్పుతున్నాయి. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలూ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్‌తో చేసిన సన్నని, తేలికపాటి గొలుసులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 35-40 సంవత్సరాల మహిళలు సైతం ఇటీవల ప్లాటినం నగలపై ఆసక్తి చూపిస్తున్నారు. బంగారు నగలు పెట్టుకోవడాన్ని పెద్దగా ఇష్టపడని ఉన్నతోద్యోగులైన యువకులు సైతం సింపుల్‌గా ఉండే ప్లాటినం నగలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్లాటినం నగల అమ్మకాలు మరింత పుంజుకుంటాయని వ్యాపారులు భావిస్తున్నారు. ప్లాటినం ఆభరణాలను (అంటే ఉంగరాలు, బ్రాస్‌లెట్స్ వంటివి) పురుషులు ఎక్కువగా కొంటారు. జంటగా ఇద్దరు ఒకే విధమైన ఆభరణాలు కొనాలనుకున్నవారు కూడా ప్లాటినం వైపే మొగ్గు చూపుతారు.
అయితే ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ప్లాటినం ఆభరణాల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతు న్నారు. దీనికి ప్రధానమైన కారణం- ప్లాటినంలో 95 శాతం స్వచ్ఛత ఉండటం. ఇక రెండోది వజ్రాలను పొదిగితే చాలా అందంగా కనిపించటం. ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలను చూస్తే- గత ఏడాది కన్నా 15 శాతం అమ్మకాలు పెరిగాయి. పురుషుల లగ్జరీ యాక్సెసరీలు, ఆభరణాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించిందని పేర్కొంది. చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. పురుషుల అభరణాల మార్కెట్, ఆభరణాలు ధరించడం పట్ల వారి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకునే నిమిత్తం ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ ఈ సర్వే నిర్వహించింది.
మనదేశంలో పురుషులు ఇప్పుడు మంచి డిజైన్లతో సన్నని ప్లాటినం గొలుసుల కోసం చూస్తున్నారు. పండుగ, పెళ్లిళ్ల సీజన్లో పురుషుల ప్లాటినం ఆభరణాల విభాగం 25-30 శాతం పెరిగింది.
ఉంగరాలు, కమ్మలు, గొలుసులు, గాజులు, నెక్లెస్‌లు, బ్రేస్‌లేట్స్ -ఇలా రకరకాల ప్లాటినం నగలు ప్రధాన నగరాల్లోని జ్యుయలరీ షోరూమ్‌లలో లభిస్తున్నాయి. ప్లాటినం మెటల్ కన్నా ప్రాసెసింగ్ ఖర్చు ఎక్కువగా ఉండడంతో చాలామంది ఆర్డరు మీదే నగలు తయారు చేసి ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజానికి మన దేశంలో కంటే ఆఫ్రికా, రష్యా, నార్త్ అమెరికా దేశాల్లో ప్లాటినం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ప్లాటినం ఫ్యాక్టరీలు మాత్రం ముంబైలో ఉన్నాయి. మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి కుటుంబాలలో, బంగారం, వెండి వంటి విలాసవంతమైన వస్తువులను సంపద – ప్రతిష్టకు చిహ్నాలుగా చూస్తారు. ప్లాటినం, వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ మొదలైన ఆధునిక నగల డిజైన్లు మెటీరియల్స్ నేడు నగల తయారీలో ఉపయోగించబడుతున్న వాటిలో ఉన్నాయి. జెమ్స్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రకారం, భారతదేశంలో ఆధునిక వస్తువుల ఆభరణాల ఎగుమతి అనూహ్యంగా పెరిగింది. వజ్రాల ఎగుమతి 211% పెరిగింది, ప్లాటినం ఆభరణాలు 180%, వెండి ఆభరణాలు 61% పెరిగాయి. 2020 కంటే 2021లో స్టడ్‌డెడ్ బంగారు ఆభరణాలు 60% పెరిగాయి.
జాగ్రత్తలు : ప్లాటినం, బంగారు నగలను ధరించి వర్షంలో గనుక బయటకు వెళ్లి వస్తే తిరిగి వచ్చిన వెంటనే వాటిని పొడి వస్త్రంతో తుడిచి గాలికి ఆరనివ్వాలి. టిషఉ్య పేపర్లో చుట్టి, నగల పెట్టెలో భద్రపరచాలి. ఎప్పుడూ పొడిగా ఉండే చోట ఈ డబ్బాను ఉంచాలి. వెండి నగల విషయానికి వస్తే – వర్షంతో వచ్చే చెమ్మకు కాంతి తగ్గడమే కాకుండా నల్లగా మారి పోతాయి. కప్పు నీళ్లలో చెంచా టూత్‌పేస్ట్ వేసి బాగా కలిపి, అందులో వెండి నగలను పదినిమిషాలు ఉంచాలి. తరవాత బ్రష్‌తో బాగా తోమి మంచినీటిలో కడిగి తుడిస్తే సరిపోతుంది.జాగ్రత్తగా చూసుకోకపోతే విరిగిపో వటం,గీతలు పడిపోవటం జరుగుతుంది. బ్రాస్‌లెట్లు, ఇయర్‌రింగ్స్, నెక్లెస్‌లను పెట్టుకుని తీసాక వాటికి ఏర్పాటుచేసిన బాక్సుల్లోనే పెట్టాలి. విడిగా పడేస్తే ఫోల్డయి మధ్యకు విరిగిపోయే ప్రమాద ముంది.
ముఖానికి వాడే బ్యూటీక్రీమ్స్, జుట్టుకు వాడే హెర్బల్ ప్రొడక్ట్స్, కలరింగ్ వల్ల కూడా ఈ ఆభరణాలు తమ ప్రకాశాన్ని కోల్పోతాయి. స్విమ్మింగ్‌ఫూల్‌లోకి దిగినపుడు వాటర్ లో ఉండే క్లోరిన్ వల్ల బంగారం నల్లగా మారే అవకాశం ఎక్కువ. అంతేకాదు తొందరగా తెగిపోతాయి కూడా. అందుకనే నీళ్లల్లోకి వెళుతున్నప్పుడు బంగారం ధరించకూడదు. ఇలా నల్లబడిన మీ బంగారం మెరుపు సంతరించుకోవాలంటే టూత్‌బ్రెష్‌ను సబ్బునీటిలో ముంచి నెమ్మదిగా నగలమీద రుద్దాలి. నగల మీద గ్రీజు మరకలేమైనా పడితే వాటిని ఆల్కహాల్‌లో ఒకసారి ముంచి తీస్తే ఆ మరకలు పోతాయి. నగలను శుభ్రపరిచాక తప్పనిసరిగా ఆరబెట్టాలి.
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834



