పలు అంశాలపై తీర్మానం..
నవతెలంగాణ – మల్హర్ రావు
ఊరి చరిత్ర, గొప్పతనం దేశంతోపాటు ప్రపంచానికి తెలిసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెరా గావ్.. మేరీ దరోహర్, కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన పంచాయతీ రాజు ఆధ్వర్యంలో నా గ్రామం..నా వారసత్వపై రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సోమవారం బహిరంగ గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో గ్రామానికి సంబంధించిన నైనా గుళ్లు రామలింగేశ్వర స్వామి ఆలయం, నాగులమ్మ ఆలయం, లక్ష్మీ దేవర ఆలయం, భేతాలుడి ఆలయం, మధునం పోచమ్మ ఆలయం, పోలుకమ్మ దేవాలయం, దర్గా, అభయాంజనేయ ఆలయం, కోలాట కళాకారుల మూడు, బృందం, అరుణోదయ, భక్తంజానేయ కళా బృందాలు తదితర వాటిపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు, ప్రజలు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యుర్లో నాగ్రామం.. నా వారసత్వంపై గ్రామసభ
- Advertisement -
- Advertisement -



