ఎన్నికలకు దూరంగా అంగ్‌సాన్ సూకీ
యాంగూన్ : మయన్మార్‌లో ఐదేండ్ల సైనిక పరిపాలన తర్వాత మొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అంతర్గత ఘర్షణల మధ్య తొలి దశ పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించడం విశేషం. మయన్మార్ రాజధాని నేపిదావ్‌తో పాటు యాంగూన్ వంటి ప్రధాన నగరాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో యాంగూన్ వీధుల్లో సైనిక వాహనాలు మోహరించాయి. ప్రతిఘటన గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
అంగ్ సాన్ సూకీ దూరం
మయన్మార్ ప్రజాస్వామ్య నాయకురాలు, 80 ఏండ్ల అంగ్ సాన్ సూకీ ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. 2021 ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటు తర్వాత ఆమెను నిర్బంధించిన జుంటా ప్రభుత్వం ఆమెకు 27 ఏండ్లు జైలు శిక్ష విధించింది. ఆమె నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్‌ఎల్‌డీ) పార్టీని సైన్యం 2023లో రద్దు చేసింది. దీంతో ఈ ఎన్నికల విశ్వసనీయతపై అంతర్జాతీ యంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపుని చ్చాయి. సైనిక మద్దతు ఉన్న ‘యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ’ విజయం సాధించేలా ఈ ఎన్నికలను రూపొందించారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
మయన్మార్‌లో ఐదేండ్ల తర్వాత తొలి దశ ఎన్నికలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



